ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తారు.. స్టే తీసుకొస్తారు: కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి సెటైర్లు

By sivanagaprasad kodatiFirst Published Nov 30, 2018, 12:17 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీ.బీజేపీ నేత కిషన్ రెడ్డి. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 2014 ఎన్నికలతో పాటు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన అనేక హామీలను కేసీఆర్ అమలు చేయలేదని మండిపడ్డారు. 

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ అడ్రస్ లేకుండా పోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని.. ఎవరి కోసం ఏర్పాటు చేశారని.. దీనివల్ల ఎవరికి లాభం జరిగిందో ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

జిల్లాలు ఎందుకు విభజించారో కేసీఆర్ కేబినెట్‌లోని మంత్రులకు కూడా అర్థం కాలేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన కేసీఆర్.. ఫిరాయింపులను ప్రొత్సహించి వారికి మంత్రి పదవులు కల్పించి రాజ్యాంగాన్ని అవమానించారని దుయ్యబట్టారు.

నాలుగున్నరేళ్లలో ఖాళీగా ఉన్న ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. నోటిఫికేషన్ విడుదల చేయడం.. వెంటనే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం ఆనవాయితీగా మారిందంటూ సెటైర్లు వేశారు. 

click me!