ఆ జిల్లా ప్రజలు తమను తెలంగాణలో కలపమంటున్నారు: కేసీఆర్

By sivanagaprasad kodatiFirst Published Nov 29, 2018, 1:29 PM IST
Highlights

మహారాష్ట్రలోని ధర్మాబాద్ జిల్లా ప్రజలు తమను తెలంగాణలో కలపమంటున్నారన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. 

మహారాష్ట్రలోని ధర్మాబాద్ జిల్లా ప్రజలు తమను తెలంగాణలో కలపమంటున్నారన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు.

రాష్ట్ర పరిస్థితులను అర్ధం చేసుకుని ఒక మార్గంలో వెళుతున్నామన్నారు కేసీఆర్. ఓటు ఒకసారి చేజారిపోతే చేయగలిగింది లేదని.. నాయకులు చెప్పింది విని నలుగురితో కలిసి చర్చించి ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఆంధ్రా పాలకులు కుల వృత్తులను నామరూపాల్లేకుండా చేశారని కేసీఆర్ విమర్శించారు. ఒకప్పుడు ప్రతీరోజు హైదరాబాద్‌కు 650 లారీల గొర్రెలు దిగుమతి అయ్యేవని.. కానీ ఇప్పుడు గొర్రెల పథకం ద్వారా తెలంగాణలో ఉన్న గొల్ల కురుమలు, యాదవులకు అందజేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

పద్మశాలీలకు 50 శాతం సబ్సిడీతో నూలు, రసాయనాలు అందజేశామన్నారు. మొదటిసారి సీఎంగా ఉన్నప్పుడు అర్థం చేసుకోవడానికే సరిపోయిందని.. మరో దఫా టీఆర్ఎస్‌కు అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

మతపిచ్చి ఇంకా ఎన్నాళ్లు సాగుతుందని సీఎం ప్రశ్నించారు. మేమేమైనా గొర్రెలమా...మీరు చెప్పింది వినడానికి, నమ్మడానికి అంటూ మోడీ, అమిత్ షాలపై టీఆర్ఎస్ అధినేత ఫైరయ్యారు.

రాష్ట్రాలకు అధికారాలు బదలాయించరా అని కేసీఆర్ ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీనిని సవరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కేసీఆర్ డిమాండ్ చేశారు. 

click me!