మర్కూక్ పంప్‌హౌస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

By narsimha lodeFirst Published May 29, 2020, 10:36 AM IST
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మర్కూక్ పంప్ హౌస్ ను సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామిలు శుక్రవారం నాడు సుదర్శనయాగం నిర్వహించారు.  
 

మెదక్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన  మర్కూక్ పంప్‌హౌస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామి లు శుక్రవారం నాడు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మర్కూక్ పంప్ హౌస్  వద్ద  సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామిలు శుక్రవారం నాడు సుదర్శనయాగం నిర్వహించారు.  మర్కూక్ పంప్ హౌస్ వద్ద గోదావరి జలాలకు సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామితో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు.

మర్కూక్ పంప్ హౌస్ వద్ద  ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, చిన్న జీయర్ స్వామిలు శుక్రవారం నాడు సుదర్శన యాగంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద రెండో రిజర్వాయర్ కొండ పోచమ్మ సాగర్. 

మర్కూక్ వద్ద పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. కేసీఆర్ దంపతులతో పాటు మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఇవాళ ఉదయం ఐదున్నర గంటల సమయంలో  సీఎం కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకొన్నారు. మర్కూక్, ఎర్రవల్లిలో రైతు వేదికల నిర్మాణానికి సీం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ రెండు రైతు వేదికలను సీఎం కేసీఆర్‌ తన సొంత ఖర్చులతో నిర్మించనున్నారు. రైతు వేదికలకు భూమిపూజ కార్యక్రమం ముగిసిన అనంతరం మర్కూక్‌ పంపు హౌజ్‌కు సీఎం కేసీఆర్‌ దంపతులు చేరుకొన్నారు. మర్కూక్‌ పంపు హౌజ్‌ వద్ద చిన్నజీయర్‌ స్వామి చేరుకోనున్నారు. చిన్నజీయర్‌ స్వామికి సీఎం దంపతులు స్వాగతం పలికారు.

అక్కడ నిర్వహించిన సుదర్శన యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో చిన్నజీయర్‌ స్వామితో పాటు సీఎం దంపతులు పాల్గొన్నారు.. అనంతరం మర్కూక్‌ పంపు హౌజ్‌ను ప్రారంభించనున్నారు సీఎం. 
 

click me!