మొక్కులు చెల్లించుకుంటున్న కేసీఆర్ కుటుంబం

Published : Dec 12, 2018, 02:28 PM ISTUpdated : Dec 12, 2018, 02:33 PM IST
మొక్కులు చెల్లించుకుంటున్న కేసీఆర్ కుటుంబం

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ఆనందానికి అవదుల్లేవు. కేసీఆర్ మరోసారి సిఎం కావడానికి కూడా ముహూర్తం ఖరారయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సతీమణి శోభ, కోడలు శైలిమ తదితర కుటుంబ సభ్యులు తమవారిని ఆశీర్వదించిన దేవుళ్లకు మొక్కులు  చెల్లించుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో పాటు పార్టీకి అఖండ విజయం అందించినందుకు నగరంలోని వివిధ దేవాలయాల్లో వీరు పూజలు చేసి మొక్కులు చెల్లించారు.   

కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కలిసి మొదట అమీర్ పేటలోని భగవాన్ సత్యసాయి బాబా ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రశాంతి నిలయం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. భారీ మెజారిటీతో గెలిపించినట్లే... కేసీఆర్ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని ముందుండి నడిపించాలని దేవుళ్లను వేడుకున్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేయడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.   

కేసీఆర్ కుటంబ సభ్యులను  దేవాలయ ప్రతినిధులు, పూజారులు సాదరంగా ఆహ్వానం పలకడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులంతా కలిసి చాలాసేపు దేవాలయంలోనే గడిపారు. 
  
PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha : కేసీఆర్ కూతురు, అల్లుడు ఏం చదువుకున్నారు, ఏ ఉద్యోగం చేసేవారో తెలుసా..?
IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు