తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రేపు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభ ఇందుకు వేదిక కానుంది.