రావూస్ హైస్కూల్ పై కడియం సీరియస్

Published : Sep 11, 2017, 04:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
రావూస్ హైస్కూల్ పై కడియం సీరియస్

సారాంశం

విద్యార్థుల టాయ్ లెట్స్ వద్ద విద్యార్థినిని నిలబెట్టడంపై డిప్యూటీ సిఎం కడియం సీరియస్వెంటనే స్కూల్ ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు 

యూనిఫాం వేసుకోలేదని ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిని అబ్బాయిల టాయిలెట్స్ వద్ద నిలబెట్టిన సంగారెడ్డి జిల్లా, బిహెచ్ఈఎల్ లోని రావూస్ హైస్కూల్ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సీరియస్ అయ్యారు. వెంటనే స్కూల్ ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ పరిధిలోని ఒక స్కూల్ లో యూనిఫాం లేదని అబ్బాయిల టాయిలెట్ వద్ద అమ్మాయిని నిలబెట్టారని ట్విట్టర్ లో వచ్చిన పోస్టింగ్ పై మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదని, దీనిని వెంటనే ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ట్విట్టర్ లో ప్రతి స్పందించారు.

మంత్రి కేటిఆర్ ట్వీట్ పై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అమ్మాయిని ఇబ్బంది పెట్టిన హైస్కూల్ కు వెంటనే వెళ్లి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇద్దరు డిఈవోలు సత్యానారాయణ రెడ్డి, విజయకుమారి బిహెచ్ఈఎల్ లోని రావూస్ హైస్కూల్ ను తనిఖీ చేసి, ఐదో తరగతి విద్యార్థిని యూనిఫాం వేసుకురానందున స్కూల్ పీఈటీ అమ్మాయిని అబ్బాయిలు టాయ్ లెట్ వద్ద నిలబెట్టింది వాస్తవమేనని ధృవీకరించారు.

స్కూల్ యాజమాన్యంతో దీనిపై చర్చించడంతో...స్కూల్ మేనేజ్ మెంట్ సదరు పీఈటీని వెంటనే తొలగించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. స్కూల్ ను తనిఖీ చేసిన అధికారులు జరిగిన సంఘటన, స్కూల్ మేనేజ్ మెంట్ తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026
Weather Update: రాబోయే 3 రోజులు వానలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక