తెలుగు రాష్ట్రాల్లో జూడాల సమ్మెవిరమణ

By Nagaraju penumalaFirst Published Aug 9, 2019, 7:42 PM IST
Highlights

ఎన్ఎంసీ బిల్లు వైద్యుల ప్రయోజనాలకు ఇబ్బంది కాబోదని స్పష్టం చేసినట్లు జూడాలకు తెలిపారు. నిబంధనల రూపకల్పన సందర్భంలో అందరి అభిప్రాయాలు చెబుతామని హామీ ఇచ్చారు. ప్రగతి నిరోధకంగా ఉన్న వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మంత్రిహామీతో జూడాలు సమ్మెవిరమించారు.  

హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లుకు వ్యతిరేకంగా తలపెట్టిన సమ్మెపై వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చర్చలు జరిపారు. 

ఈ సందర్భంగా ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతున్న అంశాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. కేంద్రవైద్యఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తో మాట్లాడినట్లు తెలిపారు. కేంద్రమంత్రితో తాను చర్చించిన అంశాలను జూడాలకు వివరించారు మంత్రి ఈటల రాజేందర్. 

ఎన్ఎంసీ బిల్లు వైద్యుల ప్రయోజనాలకు ఇబ్బంది కాబోదని స్పష్టం చేసినట్లు జూడాలకు తెలిపారు. నిబంధనల రూపకల్పన సందర్భంలో అందరి అభిప్రాయాలు చెబుతామని హామీ ఇచ్చారు. ప్రగతి నిరోధకంగా ఉన్న వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మంత్రిహామీతో జూడాలు సమ్మెవిరమించారు.  

అటు ఏపీలో సైతం జూడాలు సమ్మెను విరమించారు. ఉన్నతాధికారులకు ,జూనియర్ డాక్టర్లకు మధ్య చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు స్పష్టం చేశారు. జూడాలతో వైద్యవిద్యా అధికారి శశాంక్ జరిపిన చర్చలు సఫలమవ్వడంతో జూడాలు సమ్మె విరమణకు అంగీకరించారు. 

అయితే జూడాలు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒప్పుకుంది. దీంతో 13 జిల్లాల్లో జూడాలు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఓకే కావడంతో  సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
 
click me!