కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ ఖర్చు చెయ్యలేదు: జేపీ నడ్డా

Published : Oct 23, 2018, 08:56 PM IST
కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ ఖర్చు చెయ్యలేదు: జేపీ నడ్డా

సారాంశం

తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని రాష్ట్రబీజేపీ వ్యవహారాల ఇంచార్జ్, కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గ నియోజకవర్గ కార్యకర్తలతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. రాజకీయ స్వార్థం కోసమే టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముందస్తు ఎన్నికలు తెచ్చారని ఆరోపించారు. 

హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని రాష్ట్రబీజేపీ వ్యవహారాల ఇంచార్జ్, కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గ నియోజకవర్గ కార్యకర్తలతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. రాజకీయ స్వార్థం కోసమే టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముందస్తు ఎన్నికలు తెచ్చారని ఆరోపించారు. 
 
ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. 14వ ప్రణాళిక సంఘం ద్వారా కేంద్రం తెలంగాణకు లక్షా 26 వేల కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను టీఆర్ఎస్ సర్కార్ ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్