సూర్యనే కారణం: పోలీసులను అశ్రయించిన టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఫ్యామిలీ

Published : Feb 09, 2019, 04:30 PM IST
సూర్యనే కారణం: పోలీసులను అశ్రయించిన టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఫ్యామిలీ

సారాంశం

ఝాన్సీ ఆత్మహత్యకు సూర్యనే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఝాన్సీకి ఆమె పుట్టిన రోజు సూర్య ఓ అమ్మాయి ద్వారా పరిచయమయ్యాడని ఆమె తల్లి అంటోంది.

హైదరాబాద్: టీవీ సీరియల్ నటి ఝాన్సీ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్య వేధింపుల వల్లనే ఝాన్సీ మరణించిందని వారు ఆరోపించారు. పెళ్లి పేరుతో తన సోదరిని సూర్య మోసం చేశాడని ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్ ఆరోపించాడు. 

ఝాన్సీ ఆత్మహత్యకు సూర్యనే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఝాన్సీకి ఆమె పుట్టిన రోజు సూర్య ఓ అమ్మాయి ద్వారా పరిచయమయ్యాడని ఆమె తల్లి అంటోంది. అప్పటి నుంచి సూర్య తమ ఇంటికి వస్తూ పోతున్నాడని, ఝాన్సీతో పాటు తిరిగాడని ఆమె చెబుతోంది. 

పెళ్లి చేసుకుంటానని సూర్య చెప్పడంతో తమ సోదరి సినిమా అవకాశాలు కూడా వదులుకుందని ఝాన్సీ సోదరుడు దుర్గా ప్రసాద్ చెప్పాడు. కాగా, ఝాన్సీ ఫోన్ ను పోలీసులు అన్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. టిక్ టాక్ వీడియోలు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆత్మహత్యకు ముందు ఝాన్సీ సెల్ఫీ వీడియో తీసుకుందని అంటున్నారు. ఆ సెల్ఫీ వీడియోను సూర్యకు పంపించినట్లు భావిస్తున్నారు. సూర్యకు ఆమె 14 మెసేజ్ లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. అవన్నీ డిలిట్ అయి ఉన్నాయని తెలుస్తోంది. ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్, తల్లి అన్నపూర్ణమ్మ వాంగ్మూలాలను పంజగుట్ట పోలీసులు రికార్డు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!