ఇంటర్‌లో ఫెయిల్: ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య

By narsimha lodeFirst Published Apr 19, 2019, 3:41 PM IST
Highlights

ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత పరీక్ష్లల్లో ఫెయిలయ్యామనే బాధతో  ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్‌: ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత పరీక్ష్లల్లో ఫెయిలయ్యామనే బాధతో  ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటర్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నప్పటికీ కూడ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం ఇంటర్ బోర్డు సెక్రటరీ జనార్ధన్ రెడ్డి హైద్రాబాద్‌లో విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత ఫెయిలైన విద్యార్థులు మనోవేదనకు గురైన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్, హైద్రాబాద్,  నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడకుండా కుటుంబసభ్యులు మనో ధైర్యం చెప్పాలని  సైక్రియాటిస్టులు చెబుతున్నారు. 

click me!