ఇంటర్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ , ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jun 7, 2019, 1:35 PM IST
Highlights

ఏబీవీపీ కార్యకర్తలు ఇంటర్‌ బోర్డును ముట్టడింపు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఫలితాల వెల్లడిలో బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న చర్యలను నిరసిస్తూ ఏబీవీపీ శుక్రవారం ఇంటర్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చింది. 

గేటు దూకి లోపలికి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించడంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు ఈడ్చిపారేశారు.

మరోవైపు విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా.. సర్వత్రా ఒత్తిడి ఎదురవుతున్నా ఇంటర్‌బోర్డులో తప్పిదాలు దొర్లుతూనే ఉన్నాయి. వార్షిక పరీక్షల ఫలితాల్లో సాంకేతిక తప్పిదాలతో విద్యార్ధుల మార్కుల లిస్టులలో అనేక తప్పులు దొర్లాయి.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లలోనూ సదరు సాఫ్ట్‌వేర్ సంస్థ పొరపాట్లు చేసింది. దీంతో విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకే సబ్జెక్టులో పరీక్ష రాసే ఒకే విద్యార్ధికి రెండు వేర్వేరు నంబర్లతో హాల్ టికెట్లు జారీ అయ్యాయి. 

click me!