ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయజెండాకు అవమానం

Published : Jan 26, 2019, 11:29 AM IST
ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయజెండాకు అవమానం

సారాంశం

ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది

ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కాలేజీపై శనివారం అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే.. అధికారులు ఎగరవేసిన జాతీయ జెండా చిరిగి ఉండటం గమనార్హం.

జెండా చినిగి ఉండటాన్ని గమనించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. జెండా సరిగా ఉందోలేదో చూసుకోకుండా ఎగురవేయడం ఏమిటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన అధికారులు మరో జెండాను ఏర్పాటు చేశారు. అయితే గణతంత్ర వేడుకల ఏర్పాట్లు కూడా సరిగా లేవని విద్యార్థులు వాపోయారు. అనంతరం మరో జెండాను ఎగురవేశారు.

అయితే.. జెండా చిరిగి ఉండటంపై ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు. జెండా ఎగురవేస్తున్న సమయంలో తీవ్రమైన గాలి వచ్చిందని.. ఆ క్రమంలో హుక్కు జెండా ఇరుక్కొని చిరిగిందని తెలిపారు. పొరపాటుగా జరిగింది తప్ప.. ఉద్దేశపూర్వకంగా చేసిందికాదని వివరించారు. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!