శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

Published : Aug 27, 2019, 06:12 PM ISTUpdated : Aug 27, 2019, 06:45 PM IST
శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

సారాంశం

ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించడంతో ఈ విమానం ప్రమాదం నుండి బయటపడింది.


హైదరాబాద్: హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇండిగో  విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ల నుండి పొగలు వెలువడ్డాయి.సకాలంలో అధికారులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

ఢిల్లీ నుండి ఇండిగో విమానం హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం నాడు ల్యాండ్ అయ్యే సమయంలో  ఈ ఘటన చోటు చేసుకొంది.

విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానం టైర్ల నుండి పొగలు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించారు. ఆ సమయంలో విమానంలో 155 మంది ప్రయాణీకులు ఉన్నారు. మంటలు వ్యాపించకుండా ఎయిర్ పోర్టు అధికారులు చర్యలు తీసుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్