కారులో మాస్క్ ధరించని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి: రూ. 1000 ఫైన్ విధింపు

By narsimha lodeFirst Published May 11, 2021, 1:04 PM IST
Highlights

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైద్రాబాద్ మాజీ మేయర్  తీగల కృష్ణారెడ్డి మాస్క్  ధరించలేదని పోలీసులు ఆయనకు రూ. 1000 జరిమానా విధించారు. 

హైదరాబాద్:మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైద్రాబాద్ మాజీ మేయర్  తీగల కృష్ణారెడ్డి మాస్క్  ధరించలేదని పోలీసులు ఆయనకు రూ. 1000 జరిమానా విధించారు. హైద్రాబాద్ నగరంలోని కర్మన్‌ఘాట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో కారులో మాస్క్ లేకండా తీగల కృష్ణారెడ్డి  ప్రయాణీస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. 

ఈ విషయమై ఎస్ఐ ముఖేష్ తీగల కృష్ణారెడ్డిని ప్రశ్నించారు.  మాస్క్ ధరించనందుకు జరిమానా చెల్లించాలని తీగల కృష్ణారెడ్డిని  ఎస్ఐ ముఖేష్ కోరారు. దీంతో ఎస్‌ఐకి తగల కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.  తమకు అందరూ సమానమేనని జరిమానాకు సంబంధించిన చలానాను ఎస్ఐ తీగల కృష్ణారెడ్డికి అందించారు. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చిన సమయంలో  మాస్క్ లేకపోతే రూ. 100ే జరిమానాను విధించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ ఉత్తర్వుల మేరకు  రూ. 1000 జరిమానా చెల్లించాలని  చలానాను  ఎస్ఐ  ముఖేష్ తీగల కృష్ణారెడ్డికి ఇచ్చారు 

రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఇవాళ  జరిగే కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్ విషయమై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కరోనా విషయమై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. 

 


 

click me!