పోలీసుల అదుపులో కంజరీ గ్యాంగ్, లగ్జరీ బస్సులే ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా టార్గెట్

By Arun Kumar PFirst Published Aug 10, 2018, 12:35 PM IST
Highlights

లగ్జరీ ట్రావెల్స్ బస్సులనే టార్గెట్ గా చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళల్లో హోటల్లు, దాబాల వద్ద కాపుకాచి బస్సులోని ప్రయాణికులను దోచుకోవడమే వీరి టార్గెట్. ఇలా హైదరాబాద్ పరిధిలో పలు కేసులు నమోదవడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఈ పని మధ్యప్రదేశ్ కు చెందిన కంజర్ ఖేరా ముఠాదిగా గుర్తించారు. ఈ ముఠా సభ్యులను వారి ప్రాంతాల్లోనే హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మధ్యప్రదేశ్ దార్ జిల్లాలోని ఖేరా గ్రామానికి చెందిన దాదాపు 60 మంది ఓ దొంగల ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి ఇతర రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇలా ముఖ్యమైన పట్టణాల శివారు ప్రాంతాల్లోని హోటళ్లు, దాబాల వద్ద కాపుకాచే ముఠా సభ్యులు లగ్జరీ ట్రావెల్ బస్సులు, వాహనాలను టార్గెట్ చేస్తారు. ప్రయాణికులు తినడానికి వెళ్లగానే వారి లగేజీలోని విలువైన వస్తువులను అత్యంత చాకచక్యంగా తస్కరిస్తారు. ఇలా తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఈ కంజర్ ఖ్వేరా ముఠా దొంగతనాలకు పాల్పడింది.   

ఈ దొపిడీలను సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు వారి ఆట కట్టించారు. వీరిని పట్టుకోడానికి ఏర్పడిన ప్రత్యేక బృందాలు వారు నివాసముండే మధ్యప్రదేశ్  ఖ్వేరా గ్రామంలోనే దొంగల ముఠాను పట్టుకున్నారు. దాదాపు 25 రోజులు అక్కడ మకాం వేసి వీరిని పట్టురోడానికి హైదరాబాద్ పోలీసులు అత్యంత సాహసంతో పనిచేశారు. పదేళ్లుగా దొంగతనాలకు పాల్పడున్నప్పటికి ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కని ముఠాను ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.

ఈ ముఠాలోని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడించారు. వారి నుంచి 780 గ్రాముల బంగారం, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని పట్టుకోడానికి అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ బృందాలను కమీషనర్ ప్రశంసించారు.
 
click me!