స్వచ్ఛ సర్వేక్షన్‌తో కలిపే సంక్రాంతి సంబరాలు: హైదరాబాద్ మేయర్

By Arun Kumar PFirst Published Jan 12, 2019, 4:49 PM IST
Highlights

హైదరాబాద్ నగరాన్ని స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంచాలని నగర ప్రజలకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. అందుకోసం ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగను కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. 

హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ ఆద్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మేయర్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీలను నిర్వహించడంతో పాటు కైట్ ఫెస్టివల్ జరిపారు. చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన చోటా భీమ్, చుట్కీ ప్రదాన ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మేయర్ కూడా స్థానికులతో కలిసి  పతంగులు ఎగురవేసి వారిలో ఉత్తేజం నింపారు. 

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ...హైదరాబాద్ నగరంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయయని అన్నారు. అన్ని ప్రాంతాల్లోని సంస్కృతులనుకలిపి హైదరాబాద్ లో ఈ పండగను జరుపుకుంటారని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాడానికి సామరస్యంతో కూడిన ఇలాంటి పండగలను ఘనంగా  నిర్వహించడానికి జీహెచ్ఎంసీ కృషి చేస్తోందని...అందుకు ప్రజల నుండి కూడా సహకారం లభిస్తోందని బొంతు రామ్మోహన్ వెల్లడించారు.     

click me!