కరీంనగర్: తెలంగాణ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం నేడు(మంగళవారం) వెలువడనుంది. ఈ ఫలితంతో తెలంగాణ రాజకీయాలు మరో మలుపుతిరిగే అకవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో యావత్ రాష్ట్రం చూపంతా హుజురాబాద్ వైపే వుంది. ఇటు అధికార టీఆర్ఎస్, అటు ప్రతిపక్ష బిజెపితో తమదంటే తమదే విజయమన్న ధీమాతో వుంటే... ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఫలితంపై స్పష్టమైన అంచనా వేయలేకపోయింది. దీంతో ఓట్ల లెక్కింపు పూర్తయితేనే విజయం ఎవరిదన్నది తేలనుంది. హుజురాబాద్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలనుంది.
07:05 PM (IST) Nov 02
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ ముగిసింది. బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ .. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌పై 24,068 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి బీజేపీనే ఆధిక్యంలో వుంటూ వచ్చింది. మొత్తంగా బీజేపీకి 1,06,780 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‌కు 82,712 ఓట్లు పోలయ్యాయి.
06:31 PM (IST) Nov 02
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ విజయం ఇక లాంఛనమేప. ఇప్పటికే ఆయన మెజారిటీ 21 వేల మార్క్‌ను దాటింది. ఇంకా రెండు రౌండ్ల ఓట్లను లెక్కించాల్సి వుంది. అయితే ఇక టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈటల విజయం ఖరారైనట్లే. దీనిపై ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.
06:05 PM (IST) Nov 02
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. 20 రౌండ్లు ముగిసేసరికి ఈటల 21,015 ఓట్ల మెజార్టీతో వున్నారు. 20వ రౌండ్‌లో 1,474 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ నిలిచింది.
05:59 PM (IST) Nov 02
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. 19 రౌండ్లు ముగిసే సరికి ఈటలకు 91,312 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కి 71,771 ఓట్లు పడ్డాయి. 19వ రౌండ్‌లో బీజేపీకి 3,047 ఓట్లు పడ్డాయి. దీంతో ఈటల 19,541 ఓట్ల మెజారిటీతో వున్నారు.
04:58 PM (IST) Nov 02
04:40 PM (IST) Nov 02
ఇప్పటివరకు మొత్తం 16 రౌండ్లు పూర్తవగా ఆరంభంనుండి ఈటల రాజేందర్ ఆధిక్యమే కొనసాగుతోంది. మొత్తంగా 14 రౌండ్లలో బిజెపి మెజారిటీ సాదించగా, కేవలం 2 రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది.
04:38 PM (IST) Nov 02
04:22 PM (IST) Nov 02
15వ రౌండ్ ముగిసేసరికి ఈటల పోటీచేసిపి బిజెపికి 68,586 ఓట్లు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీచేసిన టీఆర్ఎస్ కు 57,003, కాంగ్రెస్ 1982 ఓట్లు వచ్చాయి.
04:09 PM (IST) Nov 02
15వ రౌండ్ లో బిజెపికి భారీ ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ ఆధిక్యం 11583 ఓట్లకు చేరింది. ఒక్క 15వ రౌండ్ లోనే ఏకంగా 2,149ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ రౌండ్ లో బిజెపికి 5507, టీఆర్ఎస్ కు 3358 ఓట్లు వచ్చాయి.
03:55 PM (IST) Nov 02
14వ రౌండ్ తర్వాత బిజెపికి 63079, టీఆర్ఎస్ కి 53627, కాంగ్రెస్ కి 1830 ఓట్లు వచ్చాయి.
03:45 PM (IST) Nov 02
03:18 PM (IST) Nov 02
03:11 PM (IST) Nov 02
03:01 PM (IST) Nov 02
02:59 PM (IST) Nov 02
12వ రౌండ్ లో తిరిగి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించారు. ఈ రౌండ్ లో 1,217 ఓట్ల ఆధిక్యంలో ఈటల వున్నట్లు తెలుస్తోంది. దీంతో 6,523కు పైగా ఈటల మెజారిటీ దాటే అవకాశం కనిపిస్తోంది.
02:53 PM (IST) Nov 02
పదకొండో రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థి ఈటలకు 48,588 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 43,324 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు కేవలం 2524 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 11వ రౌండ్లో బిజెపికి 3941, టీఆర్ఎస్ కు 4308 ఓట్లు వచ్చాయి.
02:47 PM (IST) Nov 02
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ 367 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అయితే 11 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 5,264 ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు.
02:37 PM (IST) Nov 02
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పదో రౌండ్‌లోనూ ఆయనే పైచేయి సాధించారు. 10 రౌండ్లు ముగిసే సరికి ఈటల రాజేందర్ 5,631 ఓట్ల మెజారిటీతో వున్నారు.
01:51 PM (IST) Nov 02
తొమ్మిదో రౌండ్ లో ఈటలకు 1835 ఓట్ల ఆధిక్యం లభించింది.
01:46 PM (IST) Nov 02
తొమ్మిదో రౌండ్ లో మళ్లీ ఈటలకే ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో ఆయన వెయ్యికి పైగా ఓట్ల లీడ్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ రౌండ్ తర్వాత ఈటల ఆధిక్యం 5111కు చేరింది.
01:44 PM (IST) Nov 02
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారిక ప్రకటన వెలువడింది. మొత్తం 753మంది పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోగా టిఆర్ఎస్ కు 455, బీజేపీకి 242, కాంగ్రెస్ 02 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ లీడ్ 213గా వుంది.
01:33 PM (IST) Nov 02
సొంత మండలం వీణవంక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు కాస్త ఊరటనిచ్చినా సొంత గ్రామం హిమ్మత్ నగర్ లో మాత్రం షాకిచ్చింది. ఈ గ్రామంలో ఈటల రాజేందర్ కు 191 ఓట్ల బిజెపి ఆధిక్యం లభించింది.
01:29 PM (IST) Nov 02
హుజురాబాద్ కౌంటింగ్ లో ఎనిమిదో రౌండ్ మాదిరిగానే తొమ్మిదో రౌండ్లో కూడా టీఆర్ఎస్, బిజెపి ల మధ్యే హోరాహోరీగా సాగుతోంది.
01:26 PM (IST) Nov 02
ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఈ రౌండ్ లో టిఆర్ఎస్ కు 4,248, బీజేపీ 4,086, కాంగ్రెస్ కు 89 కు లభించాయి. టిఆర్ఎస్ లీడ్ 162 గా వుంది.
01:14 PM (IST) Nov 02
సొంత మండలం వీణవంకలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఈటలపై స్వల్ప ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ కు 162ఓట్ల ఆధిక్యం లభించింది.
01:02 PM (IST) Nov 02
ఏడో రౌండ్ తర్వాత బిజెపి ఆధిక్యం 3432 కు చేరింది. ఈ రౌండ్ తర్వాత బిజెపికి లభించిన మొత్తం ఓట్లు 31,027, టీఆర్ఎస్ 27,589 కు చేరాయి. ఈ రౌండ్లో టిఆర్ఎస్ కు 3,792, బీజేపీకి 4,038, కాంగ్రెస్ కు 94 ఓట్లు వచ్చాయి.
12:58 PM (IST) Nov 02
హుజురాబాద్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభంనుండి ఈటల రాజేందర్ హవా కొనసాగుతోంది. వరుసగా ఆరు రౌండ్లలోనూ కొనసాగిన బిజెపి ఆధిక్యం ఏడో రౌండ్ లోనూ సాగింది.
12:40 PM (IST) Nov 02
ఆరో రౌండ్ లో బిజెపికి 4656, టీఆర్ఎస్ కి 3639 ఓట్లు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు బిజెపికి 26,983, టీఆర్ఎస్ కు 23, 797 కు ఓట్లు పడ్డాయని తేలింది.
12:30 PM (IST) Nov 02
ఆరో రౌండ్ లో ఈటల 1017 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీంతో ఆయన మొత్తం ఆధిక్యం 3186 చేరువయ్యింది.
12:03 PM (IST) Nov 02
హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం తాము ఊహించినదేనని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు. హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరుతుందని... ఈటల తిరిగి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
12:01 PM (IST) Nov 02
హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన అన్ని రౌండ్లలో ఆధిక్యం ఈటలనే వరించగా తాజాగా ఆరో రౌండ్ లోనూ ఆయనే ఎక్కువ ఓట్లు సాధించారు.
11:54 AM (IST) Nov 02
ఐదో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ ఆధిక్యం 2169 చేరుకుంది.
11:42 AM (IST) Nov 02
ఐదో రౌండ్లోనూ బిజెపి హవా కొనసాగుతోంది. ఈ రౌండ్ లోనూ ఈటల రాజేందర్ కే ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో బిజెపికి 4358, టీఆర్ఎస్ కి 4014 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్ ముగిసాక బిజెపికి మొత్తం 22327, టీఆర్ఎస్ 20158 ఓట్లు వచ్చాయి.
11:29 AM (IST) Nov 02
నాలుగో రౌండ్ కు బిజెపికి 4314, టీఆర్ఎస్ కి 3882 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్ లో బిజెపికి 400పైచిలుకు ఓట్ల ఆధిక్యం లభించింది.
10:58 AM (IST) Nov 02
హుజురాబాద్ నాలుగో రౌండ్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని సాధించారు. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటలకు 1825 ఓట్ల ఆధిక్యం లభించింది.
10:32 AM (IST) Nov 02
హుజురాబాద్ మూడొ రౌండ్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని సాధించారు. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటల ఆధిక్యం 1411 ఓట్లకు చేరింది. మూడో రౌండ్ లో బిజెపి 1053 ఓట్ల భారీ ఆధిక్యం సాధించింది.
10:23 AM (IST) Nov 02
10:14 AM (IST) Nov 02
రెండు రౌండ్ల తర్వాత బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం 358కి చేరకుంది. ఇప్పటివరకు వెలువడ్డ రెండు రౌండ్లతో కలిపి మొత్తంగా బిజెపికి 9,461, అధికార టీఆర్ఎస్ కు 9103, కాంగ్రెస్ కు 339 ఓట్లు వచ్చాయి.
10:08 AM (IST) Nov 02
హుజురాబాద్ రెండో రౌండ్ లో బిజెపి 193 ఆధిక్యాన్ని సాధించింది. బిజెపికి 4851, టీఆర్ఎస్ 4659, కాంగ్రెస్ 220 ఓట్లు వచ్చాయి.
09:54 AM (IST) Nov 02