పొత్తుల ఎఫెక్ట్ : కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

By Arun Kumar PFirst Published Nov 20, 2018, 5:51 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో అతి ముఖ్యమైన నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. దీంతో మంగళవారం నుండి నామినేషన్ల పరిశీలన ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి  సరైన పత్రాలు సమర్పించని అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ ప్రక్రియలో మొదటి తిరస్కరణ వేటును కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిపై పడింది. 

మహాకూటమి పొత్తుల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సిపిఐకి లభించింది. దీంతో ఆ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫోటీచేయాలని భావించిన అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ముందుగానే తన నామినేషన్‌ను దాఖలుచేశారు. అయితే ఆ స్థానం సిపిఐకి కేటాయించడంతో ఈయనకు కాంగ్రెస్ బీపారం రాలేదు. ఇది లేకుండానే ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొంటూ నామినేషన్ పత్రాలు సమర్పించారు. 

అయితే ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన పార్టీ నుండి పోటీ  చేయాలంటే అభ్యర్థి పేరుతో పార్టీ భీపారం ఉండాలి. లేదంటే ఆ నామినేషన్ చెల్లదు. ఇలా బీపారం దక్కని వారంతా ఇండిపెండెంట్ గా నామినేషన్లు వేస్తుంటారు. కానీ ప్రవీణ్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు కానీ ఆయన సమర్పించిన పత్రాల్లో బీఫాం లేదు. దీంతో అధికారులు ఈ నామినేషన్ ను తిరస్కరించారు. 
 
click me!
Last Updated Nov 20, 2018, 5:51 PM IST
click me!