తల వెంట్రుకల స్కాం: చైనాకు అక్రమంగా తరలింపు, ఆ కంపెనీలకు నోటీసులు

By narsimha lodeFirst Published Aug 27, 2021, 11:57 AM IST
Highlights

తల వెంట్రుకల స్కాంలో  చైనా పాత్ర ఉందని ఈడీ అధికారులు గుర్తించారు. అక్రమంగా ఇండియా నుండి 10 కంపెనీలు చైనాకు తల వెంట్రుకలను తరలిస్తున్నారని ఈడీ గుర్తించింది. నగదు చెల్లింపులు కూడా చైనా యాప్ ద్వారా చేసినట్టుగా గుర్తించారు.

హైదరాబాద్: తల వెంట్రుకల స్కాంలో చైనా హస్తం ఉందని ఈడీ గుర్తించింది.చైనాకు అక్రమంగా తల వెంట్రుకలను తరలిస్తున్న 10 కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది.మయన్మార్ మీదుగా చైనాతో పాటు వియత్నాంలకు అక్రమంగా తల వెంట్రుకలను తరలిస్తున్నట్టుగా గుర్తించారు. తల వెంట్రులక స్కాం విషయమై ఈడీ అధికారులు హైద్రాబాద్ కేంద్రంగా దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో  ఈడీ కీలక విషయాలను కనుగొంది.

హైద్రాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన ఇద్దరు వ్యాపారులు నరేష్, వెంకట్రావులకు చైనాకు చెందిన యాప్‌ల ద్వారా నగదు చెల్లించినట్టుగా ఈడీ గుర్తించింది. ఈ యాప్‌ల ద్వారా  వచ్చిన నగదు జమ చేసిన బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు.

హవాలాలో లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అనుమానిస్తుంది. మరోవైపు బంగారం రూపంలో కూడ చెల్లింపులు జరిగినట్టుగా ఈడీ గుర్తించింది. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టేలా అక్రమ మార్గంలో చైనాకు తల వెంట్రుకలను తరలించినట్టుగా ఈడీ అనుమానిస్తుంది. 

తప్పుడు వే బిల్లుల ఆధారంగా  చైనాకు తల వెంట్రుకలను తరలించారని గుర్తించారు. మరో వైపు సాధారణం చూపే బరువు కంటే అధిక  బరువుతో అక్రమంగా చైనాకు తల వెంట్రుకలను తరలించినట్టుగా గుర్తించారు.ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.32 కోట్ల విలువైన తల వెంట్రుకలను చైనాకు ఎగుమతి చేసినట్టుగా గుర్తించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల నుండి కూడ తల వెంట్రుకలను  తీసుకెళ్లారని గుర్తించారు.
 

click me!