సచివాలయం కూల్చివేతపై రేవంత్ పిటిషన్: జూలై 8న విచారణ

By narsimha lodeFirst Published Jun 28, 2019, 4:48 PM IST
Highlights

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేయకూడదని  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు  హైకోర్టు విచారించింది. 
 

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేయకూడదని  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు  హైకోర్టు విచారించింది. 

ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చివేసి... అదే స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేసింది.ఈ మేరకు సీఎం కేసీఆర్ గురువారం నాడు భూమి పూజ కూడ నిర్వహించారు.

అయితే సచివాలయాన్ని కూల్చివేయకూడదని  కోరుతూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గురువారం నాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేసింది. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు అభిప్రాయపడింది.

అయితే ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు అసంబద్దంగా ఉన్న సమయంలో  కోర్టులు జోక్యం చేసుకొన్న విషయాన్ని సుప్రీంకోర్టు  జోక్యం చేసుకొన్న విషయాన్ని  పిటిషన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం ఉన్న సచివాలయంలో  అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ఈ తరుణంలో  అన్ని సౌకర్యాలు ఉన్న సచివాలయాన్ని కూల్చివేయడం ప్రజా ధనాన్ని వృధా చేయడమేనని ఆయన పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు తీసుకెళ్లారు. ఈ కేసుపై  జూలై 8వ తేదీన విచారణ చేయనున్నట్టు హైకోర్టు తెలిపింది.

click me!