ఉప్పల్ స్టేడియంలో తప్పిన పెను ప్రమాదం

Published : Apr 23, 2019, 10:00 AM IST
ఉప్పల్ స్టేడియంలో తప్పిన పెను ప్రమాదం

సారాంశం

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి నగరంలో భారీగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, షెడ్స్ కుప్పకూలాయి. 

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి నగరంలో భారీగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, షెడ్స్ కుప్పకూలాయి. ఉప్పల్ స్టేడియంలో సౌత్ పెవీలియన్ బైలాక్‌లో పెనుగాలులకు షెడ్డు, ఓ ఎల్ఈడీ కుప్పకూలాయి. 

ఈదురు గాలులు తాకిడికి ఎనభై శాతం సౌత్ పెవీలియన్ దెబ్బతిన్నది. అయితే ఐపీఎల్ మ్యాచ్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు జనాలు ఎవరూ లేకపోవడంతో సిబ్బంది ఊపిరిపీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ షెడ్స్, ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్
IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ