జుమ్మెరాత్ బజార్ లో పోలీసుల లాఠీచార్జ్ : ఎమ్మెల్యే రాజాసింగ్ కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

By Nagaraju penumalaFirst Published Jun 20, 2019, 8:09 AM IST
Highlights

పోలీసుల లాఠీచార్జ్ లో గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలకు తీవ్ర గాయమైంది. తల నుంచి రక్తం తీవ్రంగా  కారడంతో ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో రాజాసింగ్ వైద్యం చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. 

హైదరాబాద్‌: జుమ్మెరాత్‌ బజార్‌లో బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జుమ్మెరాత్ బజార్‌లోని స్థానికులంతా కలిసి రాణి అవంతిభాయ్‌ విగ్రహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

రాణి అవంతిభాయ్ విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 

గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో పోలీసులు, రాజాసింగ్ అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 

click me!