
పుదుచ్చేరి రాజ్ నివాస్ నుంచి హైదరాబాద్ రాజ్‌భవన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గవర్నర్ తమిళిసై. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి తెలంగాణ రాష్ట్ర అంశలపై ఆమె సమీక్షించారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం, బాగోగులే తనకు అత్యంత ప్రాధాన్యమని తమిళిసై చెప్పారు. అవసరమైన విషయాలు తన దృష్టికి తీసుకురావాలని రాజ్‌భవన్ అధికారులు సూచించారు గవర్నర్ తమిళిసై.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిరణ్ బేడిని కేంద్ర ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.
దీంతో తెలంగాణ గవర్నర్ అయిన తమిళిసైకి రాష్ట్రపతి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వీ నారాయణస్వామి, ఇతర మంత్రులు హాజరయ్యారు.