టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం.. కార్మికులకు శుభాకంక్షలు..

Published : Sep 14, 2023, 11:38 AM IST
టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం.. కార్మికులకు శుభాకంక్షలు..

సారాంశం

టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఇక, గత అసెంబ్లీ సమావేశాల్లో టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఇటీవల ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు తాజాగా గవర్నర్‌ తమిళిసైతో కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఆమోదం తెలిపిన దాదాపు నెల రోజుల తర్వాత ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !