శేరిలింగపల్లిలో బీజేపీ నాయకులపై దాడి చేసిన స్థానికులు

Published : May 21, 2022, 03:51 PM IST
శేరిలింగపల్లిలో బీజేపీ నాయకులపై దాడి చేసిన స్థానికులు

సారాంశం

హైదరాబాద్ శేరిలింగపల్లిలో బీజేపీ నాయకులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలు గజ్జల యోగానంద్, మువ్వా సత్యనారాయణపై గోపనపల్లి స్థానికులు దాడికి దిగారు. వారిపై పిడి గుద్దులు కురిపించారు.

హైదరాబాద్ శేరిలింగపల్లిలో బీజేపీ నాయకులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలు గజ్జల యోగానంద్, మువ్వా సత్యనారాయణపై గోపనపల్లి స్థానికులు దాడికి దిగారు. గోపనపల్లిలో ఓ చెరువును బీజేపీ నేతలు ఫొటోలు తీస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. కబ్జాకు గురైన చెరువు అది కాదంటూ గజ్జల యోగానంద్, మువ్వా సత్యనారాయణలపై దాడికి దిగారు. వారిపై పిడి గుద్దులు కురిపించారు. అయితే అక్కడున్నవారు అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

ఈ దాడి అనంతరం ఇరువర్గాలు పరస్పరం చందానగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి Gajjala Yoganand బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ చేతిలో యోగానంద్ ఓటమి పాలయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!