బంగారానికి వెండి కోటింగ్.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.4 కోట్ల గోల్డ్ సీజ్

By Siva KodatiFirst Published Oct 7, 2022, 6:09 PM IST
Highlights

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ఏడున్నర కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.4 కోట్లు వుంటుందని తెలిపిన అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ఏడున్నర కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల దగ్గర బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. గోల్డ్‌కి వెండి కోటింగ్ వేసి తరలించే యత్నం చేశారు. వారి పన్నాగాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారులు గుట్టు రట్టు చేశారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.4 కోట్లు వుంటుందని తెలిపిన అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

Also REad:శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 2.58 కోట్ల బంగారం సీజ్

ఇకపోతే.. రెండ్రోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి రూ. 2.58 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి లగేజీని స్కాన్ చేసిన అధికారులు  బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. శంషాబాద్ ఎయిర్  పోర్టుతో పాటు దేశంలోని పలు చోట్ల అక్రమంగా బంగారం తరలిస్తున్న పలువురు పట్టుబడిన ఘటనలు నెలకొన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15న దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకురాలి నుండి 268 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు 14 లక్షలుంటుందని అధికారులు అంచనా వేశారు
 

click me!