భద్రాచలం వద్ద 70 అడుగులకు చేరిన గోదావరి: రంగంలోకి ఆర్మీ

By narsimha lode  |  First Published Jul 15, 2022, 3:40 PM IST

భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులకు చేరింది. దీంతో మూడో సారి భద్రాచలం వద్ద 70 అడుగులకు చేరినట్టైంది.గోదావరికి వచ్చే రహదారులన్నీ నీటిలో మునిగిపోయాయి. సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఐఎఎస్ అధికారి శ్రీధర్ ను ప్రభుత్వం నియమించింది.ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.


ఖమ్మం: Bhadrachalam వద్ద Godavari  ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులకు చేరింది.  70 అడుగులకు గోదావరి చేరడం ఇది మూడోసారి. 1986లో  గోదావరి నది భద్రాచలం వద్ద 75.6 అడుగులకు చేరింది. 1990లో గోదావరి నది భద్రాచలం వద్ద 70 అడుగులకు చేరింది. తాజాగా ప్రస్తుతం మరోసారి 70 అడుగులకు చేరింది. అయితే ప్రస్తుతం 70 అడుగులకు పైగానే వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అంచన వేస్తున్నారు. ఎగువన కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. 

భద్రాచలం వద్ద Bridge పై రాకపోకలను నిలిపివేశారు. 48 గంటల పాటు  రాకపోకలను నిలిపివేయనున్నారు. మరో వైపు భధ్రాచలం పట్టణానికి వచ్చే అన్ని మార్గాల్లో గోదావరి నీరు చేరింది. దీంతో భద్రచలానికి వచ్చే మార్గాలు మూసుకుపోయాయి.  గోదావరి నదికి వరద పోటెత్తితే భద్రాచలంపట్టణంలోకి వరద నీరుచేరకుండా ఉండేందుకు గాను ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో రామాలయానికి ఉత్తర భాగంలో కరరకట్టను నిర్మించారు . ఈ కరకట్ట ప్రస్తుతానికి భద్రాచలం పట్టణానికి రక్షణగా నిలిచింది.  గతంలో 66 అడుగుల మేర వరద నీటిని ఈ కరకట్ట అడ్డుకొంది. అయితే ప్రస్తుతం 70 అడుగుల మేర నీరు వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.భద్రాచలం  నుండి ఛత్తీస్ ఘడ్, ఏపీ, తెలంగాణ వైపు వచ్చే మార్గాలన్నీ నీటితో నిండిపోయాయి. రాకపోకలు సాగించే వీలు లేకుండా పోయింది. 

Latest Videos

భధ్రాచలం వద్ద గోదావరి వరద పోటెత్తడంతో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గాను ఐఎఎస్ అధికారి శ్రీధర్ ను రాష్ట్ర ప్రబుత్వం నియమించింది. మరో వైపు 101 మందితో కూడా ఆర్మీ బృందాన్ని కూడా భద్రాచలానికి పంపారు. 

ముఖ్యమంత్రి KCR  ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని  ప్రభుత్వం కోరింది.  68 మంది సభ్యులుగల ఇంఫ్రాన్ట్రీ,  10  మంది సభ్యులుగల వైద్య బృందం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. వీరితో పాటు 23 మంది సభ్యులుగల ఇంజనీరింగ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటుంది.  మొత్తం ఐదు బృందాలుగా ఉన్న ఈ సైనిక బృందంలో నలుగురు అధికారులు, ఐదుగురు జేసీఓ లు, 92 వివిధ ర్యాంకుల సభ్యులుంటారు. 

also read:ధవళేశ్వరం వద్ద పోటెత్తిన గోదావరి:మూడో ప్రమాద హెచ్చరిక జారీ, 23 లక్షల క్యూసెక్కులు వచ్చే చాన్స్

సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక బోట్ లను సిబ్బందితో సహా భద్రార్ది జిల్లాకు పంపారు. ఫైర్ విభాగానికి చెందిన 7 బోట్ లు సిద్ధంగా ఉంచారు. . లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది స్విమ్మర్లు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి, సింగరేణి కాలరీలు ఎం.డి. ఎం. శ్రీదర్ లను ప్రత్యేక అధికారిగా నియమించామని  సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు.సింగరేణి సంస్థకు చెందిన యంత్రాంగాన్ని ఈ సహాయ పునరావాస చర్యలకు ఉపయోగించాలని ఆదేశించారు.
 

click me!