గ్లోబల్ ఆసుపత్రిలో విధ్వంసం.. నలుగురి అరెస్ట్

By sivanagaprasad KodatiFirst Published Dec 26, 2018, 8:17 AM IST
Highlights

హైదరాబాద్ లక్డీకపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రి విధ్వంసం కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. షమీన్ బేగం అనే మహిళ గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆమె మరణించారు. 

హైదరాబాద్ లక్డీకపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రి విధ్వంసం కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. షమీన్ బేగం అనే మహిళ గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆమె మరణించారు.

దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి చనిపోయిందంటూ ఆమె కుమారులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్, కంప్యూటర్స్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. సిబ్బంది సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులపై సైతం చేయి చేసుకున్నారు.

సీఐని నెట్టివేస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అసభ్యపదజాలంతో దూషించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విధ్వంసానికి పాల్పడ్డ షమీన్ బేగం కుమారులు మీర్ మోహినుద్దీన్, బర్కత్ అలీ, ముస్తాఫా అలీ, మొసిన్‌లను అరెస్ట్ చేశారు. 

"

click me!