రెవెన్యూ శాఖ వ్యవహారం.. నాకు సంబంధం లేదు: ఎమ్మార్వో బదిలీపై గద్వాల విజయలక్ష్మీ స్పందన

By Siva KodatiFirst Published Feb 16, 2021, 5:02 PM IST
Highlights

షేక్‌పేట్ ఎమ్మార్వో బదిలీలో తన ప్రమేయం లేదన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. ఎమ్మార్వో బదిలీపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని ఆమె తెలిపారు. బదిలీ అనేది రెవెన్యూ శాఖ వ్యవహారమని విజయలక్ష్మీ స్పష్టం చేశారు. 

కొద్ది రోజుల క్రితం ఆనాటి కార్పోరేట‌ర్, నేటి జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మికి… షేక్ పేట ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డికి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. తనను విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎమ్మార్వో, కార్పోరేట‌ర్ విజ‌య‌ల‌క్ష్మి మీద బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఆ త‌ర్వాత విజ‌య‌ల‌క్ష్మి ఈ ఆరోపణను ఖండిస్తూ కౌంటర్‌గా ఎమ్మార్వో మీద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11 న జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా ఎన్నికైన కొద్ది గంట‌ల్లోనే విజ‌య‌ల‌క్ష్మీ.. శ్రీనివాస్ రెడ్డి ని షేక్‌పేట నుంచి ట్రాన్స‌ఫ‌ర్ చేయించ‌డం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. 

click me!