అంబర్‌పేట్ ఘటన.. హైదరాబాద్‌లో వీధి కుక్కల నివారణకు జీహెచ్ఎంసీ హైలెవల్ కమిటీ

Siva Kodati |  
Published : Mar 03, 2023, 08:22 PM ISTUpdated : Mar 03, 2023, 08:24 PM IST
అంబర్‌పేట్ ఘటన.. హైదరాబాద్‌లో వీధి కుక్కల నివారణకు జీహెచ్ఎంసీ హైలెవల్ కమిటీ

సారాంశం

హైదరాబాద్‌లో వీధి కుక్కల నివారణకు హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. ఇందులో మేయర్ అధ్యక్షతన అన్ని పార్టీల కార్పోరేటర్లు, అధికారులు వుంటారు. 

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మరణించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. దీనిలో భాగంగా వీధి కుక్కల నివారణకు హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. మేయర్ అధ్యక్షతన అన్ని పార్టీల కార్పోరేటర్లు, అధికారులు ఈ కమిటీలో వున్నారు. కుక్కల బెడద నివారణకు సూచనలు, సలహాలు ఇవ్వనుంది ఈ కమిటీ. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో యానిమల్ కేర్ సెంటర్లను పరిశీలించనుంది. 

కాగా.. హైదరాబాద్ అంబర్‌పేట్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ప్రదీప్ తన తండ్రితో కలిసి ఆయన పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. అయితే తండ్రి పనిచేసుకుంటూ వుండటంతో అక్కడికి సమీపంలోనే వున్న అక్క దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ మూడు వీధి కుక్కలు.. చిన్నారిని చుట్టుముట్టాయి. అవి అరుస్తూ, దాడి చేస్తుండటంతో బాలుడు భయాందోళనలకు గురయ్యాడు. తప్పించుకునేందుకు ఆ చిన్నారి ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఆ కుక్కలు చిన్నారిపై దాడి చేస్తూ నోట కరచుకుని దాడి చేశాయి.

ALso REad: కుక్కల దాడిలో బాలుడి మృతి .. ప్రదీప్ కుటుంబానికి జీహెచ్‌ఎంసీ పరిహారం,ఎంతిచ్చారంటే...

ప్రదీప్ తండ్రి అక్కడికి వచ్చేలోపే చిన్నారిని ఆ కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. దీంతో బాబుని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లాడిపై కుక్కల దాడికి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

మరోవైపు.. అంబర్‌పేట్ తరహా ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. ఆరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్ కమీషనర్లు, అధికారులతో ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ఆకలితోనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయని వ్యాఖ్యానించారు. కుక్కలు ఎక్కువగా వున్న ప్రాంతాలపై దృష్టి పెడతామని మేయర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 4 లక్షలకు పైగా కుక్కలను స్టెరిలైజ్ చేశామని విజయలక్ష్మీ వెల్లడించారు.

Also REad: కుక్కల దాడిలో చిన్నారి బలి.. అంబర్‌పేట్‌లో పోలీసుల విచారణ, కార్ల షోరూమ్ ప్రతినిధులపై కేసు

ఇక ఈ ఘటనలో చనిపోయిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రదీప్ కుటుంబానికి రూ.8 లక్షలు పరిహారం అందించాలని కౌన్సిల్ నిర్ణయించింది. బాలుడి కుటుంబానికి తమ నెల రోజుల వేతనం విరాళంగా ఇవ్వాలని కార్పోరేటర్లు తీర్మానించారు. 
 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే