గంజాయి డాన్ షిండే అరెస్టు: హైదరాబాద్ రూ. 21 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్

By telugu teamFirst Published Aug 30, 2021, 12:56 PM IST
Highlights

ఎట్టకేలకు గంజాయి డాన్ షిండే ఎన్సీబీ అధికారుల చేతికి చిక్కాడు. ఎన్సీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. హైదరాబాదు ఓఆర్ఆర్ వద్ద ఎన్సీబీ అధికారులు కోట్లాది రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: ఎట్టకేలకు గంజాయి డాన్ షిండే ఎన్సీబీ అధికారులకు చిక్కాడు. ఎన్సీబీ అధికారులు షిండేను అరెస్టు చేశారు. గతంలో కూడా అరెస్టయిన షిండే తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం దేశంలో ఆరు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అతను ఎన్సీబికి చిక్కాడు. 

షిండే దక్షిణాది నుంచి ఉత్తరాదికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ గుర్తించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాదు మీదుగా ముంబై, ఢిల్లీలకు గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టారు. 

బెంగళూరు ఎన్సీబీ అధికారులు హైదరాబాదులోని సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడంతో పెద్ద యెత్తున గంజాయి పట్టుబడింది. హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజ్ వద్ద అధికారులు రూ.21 కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గన్నీ బ్యాగుల్లో గంజాయిని నింపి, దానిపై కప్పు వేసి, ఆపైన మెక్కలను లోడ్ చేశారు. దీంతో గంజాయి గురించి అనుమానం రాదని వారు భావించారు. 

షిండే అతి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. షిండేకు సహకరిస్తున్నవారిపై నిఘా పెట్టి, షిండేను అరెస్టు చేయగలిగారు. షిండేకు సహకరిస్తున్నవారిపై నిఘా పెట్టడంతో వారికి ఫలితం దక్కింది. 

click me!