బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత

By narsimha lode  |  First Published Jul 20, 2023, 3:38 PM IST

గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత  కాంగ్రెస్ పార్టీలో చేరారు. 


న్యూఢిల్లీ:  గద్వాల  జిల్లా పరిషత్ చైర్ పర్సన్  సరిత  గురువారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్ననే ఆమె  బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇవాళ ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో  కాంగ్రెస్ పార్టీ  తీర్థం పుచ్చుకున్నారు.

గత కొంతకాలంగా సరిత  కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతుంది.  కొల్లాపూర్ లో జరిగే   సభలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని సరిత  నిర్ణయించుకున్నారు. అయితే  ఇవాళ జరగాల్సిన కాంగ్రెస్ సభ వాయిదా పడింది. వాతావరణ పరిస్థితుల కారణంగా  సభను ఈ నెల  30వ తేదీకి వాయిదా వేశారు.  దీంతో  న్యూఢిల్లీకి వెళ్లి  మల్లికార్జున ఖర్గే సమక్షంలో  సరిత  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.రానున్న ఎన్నికల్లో  గద్వాల అసెంబ్లీ స్థానం నుండి సరిత  కాంగ్రెస్ అభ్యర్థిగా  బరిలోకి దిగే అవకాశం ఉంది.  గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న సరితకు  స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య గ్యాప్ నెలకొంది.దీంతో  సరిత  బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారని ఆమె  వర్గీయులు చెబుతున్నారు.

Latest Videos

undefined

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  సరిత కుటుంబ సభ్యులను సంప్రదించారు. కాంగ్రెస్ లో చేరాలని  ఆహ్వానించారు. సరిత  కుటుంబం కూడ ఈ ఆహ్వానానికి  అంగీకరించింది.  దరిమిలా  నిన్న బీఆర్ఎస్ కు  సరిత రాజీనామా చేశారు. ఇవాళ  మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ నెల  30న కొల్లాపూర్ లో జరిగే ప్రియాంక గాంధీ సభలో   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

also read:గద్వాలలో బీఆర్ఎస్‌కు షాక్:పార్టీకి రాజీనామా చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత

రానున్న రోజుల్లో ఇతర  జిల్లాల నుండి పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో  చేరనున్నారని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ఇప్పటికే  ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

 

click me!