అది గన్ కాదు లైటర్, సోషల్ మీడియాపై నిఘా: కరీంనగర్ డీసీపీ శ్రీనివాస్

Published : Aug 23, 2021, 09:35 PM IST
అది గన్ కాదు లైటర్, సోషల్ మీడియాపై నిఘా: కరీంనగర్ డీసీపీ శ్రీనివాస్

సారాంశం

కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన గడ్డం కృష్ణ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై కరీంనగర్ శాంతిభద్రతల డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కృష్ణ  గన్ తో ఫోటో దిగినట్టుగా పోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. అయితే శ్రీనివాస్ ఉపయోగించింది గన్ కాదని లైటర్ గా తేల్చారు పోలీసులు.

కరీంనగర్:కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టుగా శాంతిభద్రతల అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. సోమవారం నాడు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లో సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. నిఘాలో భాగంగా గన్ తో దిగిన ఫోటో వెనుక అసలు కారణాన్ని తేల్చినట్టుగా చెప్పారు. 

కరీంనగర్ గోదాం గడ్డకు చెందిన గడ్డం కృష్ణ గన్ తో ఫోటో దిగినట్టుగా సోషల్ మీడియాలో ఫోటో వైరల్ గా మారింది. కృష్ణ ఉపయోగించింది గన్ కాదని సిగరెట్ వెలిగించే లైటర్ గా ఆయన తేల్చారు. 

గడ్డం కృష్ణ కు కరోనా సోకిందన్నారు. ఆయన ఐసోలేషన్ పూర్తైన తర్వాత ఆయనపై కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. సోషల్ మీడియా లో రెచ్చగిట్టే  పోస్టులు , అసభ్యకర పోస్టులు పెడితే 107 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అంతేకాదు నిందితులను  బైండోవర్ చేస్తామని ఆయన హెచ్చరించారు.ప్రవర్తనలో మార్పు లేకపోతే హిస్టరీ షీట్ తెరుస్తామని ఆయన హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌