కరోనాతో మాజీ ఎమ్మెల్యే , సీపీఎం నేత ముస్కు నర్సింహ్మ మృతి

By narsimha lode  |  First Published Jul 27, 2020, 2:19 PM IST

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత ముస్కు నర్సింహ్మ సోమవారం నాడు కరోనాతో మరణించాడు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారంగానే నర్సింహ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా సీపీఎం నేతలు తెలిపారు.


హైదరాబాద్: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత ముస్కు నర్సింహ్మ సోమవారం నాడు కరోనాతో మరణించాడు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారంగానే నర్సింహ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా సీపీఎం నేతలు తెలిపారు.

కరోనాతో పాటు ఇతర వ్యాధుల కారణంగా  ముస్కు నర్సింహా మృతి చెందినట్టుగా సీపీఎం ప్రకటించింది. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి నర్రా రవికుమార్ పై ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు.  

Latest Videos

undefined

ఐదు రోజుల క్రితం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. కరోనాతో పాటు ఇతర వ్యాధులకు ఆయన చికిత్స తీసుకొంటున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఆయన మృతి చెందాడు. 

కళాకారుడిగా నర్సింహ్మకు మంచి గుర్తింపు ఉంది. కొండిగారి రాములు పార్టీకి దూరమైన తర్వాత ముస్కు నర్సింహను ఈ స్థానం నుండి సీపీఎం బరిలోకి దింపింది. పార్టీ కోసం ఆయన తన చివరి క్షణం వరకు పనిచేశారని పార్టీ నేతలు గుర్తు చేసుకొన్నారు. 

1994లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1004 ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2000 ఎన్నికల్లో ఆయన పోటీచేసి ఓటమి పాలయ్యాడు. స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓటమిని చవిచూశాడు. 

2009 ఎన్నికల తర్వాత సీపీఎం నుండి ఆయన సీపీఐలో చేరారు. ఆ తర్వాత  సీపీఐని వీడి ఇటీవలనే ఆయన సీపీఎంలో చేరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటి సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 

click me!