మునుగోడులో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు..

By Bukka SumabalaFirst Published Aug 5, 2022, 7:33 AM IST
Highlights

రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన మునుగోడులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిమీద దుండగులు వెనకనుంచి వచ్చి కాల్పులు జరిపారు. 

మునుగోడు : మునుగోడులో కాల్పుల కలకలం సృష్టించాయి. టూవీలర్ మీద వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు మరో బైక్ పై వెంబడించి.. వెనుక  వైపు నుంచి వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ  ఘటన నల్గొండ జిల్లాలో భయాందోళనలు రేపింది. మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో బుధవారం రాత్రి ఇది చోటు చేసుకుంది. ఎస్సై సతీష్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం …నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన  నిమ్మల లింగస్వామి (32) మునుగోడులో కూల్ డ్రింక్స్, నీళ్ల బాటిళ్ల్స్ వ్యాపార్ం చేస్తుంటాడు. 

దీంతోపాటు రియల్ ఎస్టేట్ చేస్తూ బ్రాహ్మణ వెల్లంపల్లిలో ఉంటున్నాడు. రోజువారీగా దుకాణం మూసేసి టూ వీలర్ పై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి రెండు, మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో లింగస్వామి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసి లింగస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, కాల్పుల శబ్దం విన్న సమీపంలో ఉన్న స్వామి అనే వ్యక్తి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే లింగస్వామి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. ఘటన జరిగిన స్థలం వద్ద ఓ బుల్లెట్ పడి ఉంది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ డిఎస్పి నరసింహారెడ్డి కామినేని ఆస్పత్రి వద్దకు వెళ్లి పరిశీలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటు మరికొందరిపై అనుమానం ఉందని బాధితులు డీఎస్పీకి చెప్పినట్లు సమాచారం. 

మునుగోడుపై కాంగ్రెస్ ఫోకస్:రేపు చండూరులో సభ

ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో మునుగోడు ఇటీవల వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడు స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్.. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, రాజీనామా చేశాడు కాబట్టి.. రాజగోపాల్ రెడ్డినే అక్కడ నెలబెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ.. దుబ్బాక, హూజారాబాద్ ఓటమికి బీజేపీపై గరం గరం ఉన్న కేసీఆర్ ఇక్కడ గెలవాలని గట్టిగా ఉన్నారు.. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలో త్రిముఖపోటీ నెలకొననుంది. 

ఇక పార్టీకి రాజీనామా చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట కాంగ్రెస్ క్యాడర్ వెళ్లకుండా ఆ పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్తున్న నాలుగు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అధ్యక్షులను పార్టీ నుంచి సస్పండ్ చేసింది. పార్టీ కేడర్ లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నాల్లో భాగంగా.. ఆగస్ట్ 5న చుండూరులో సభను ఏర్పాటు చేయానుంది కాంగ్రెస్. చండూరులోని జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో ఈ సభ జరగనుంది. 

click me!