జీఎస్టీ ఎఫెక్ట్: భారీగా తగ్గిన టపాసుల ధరలు

By sivanagaprasad kodatiFirst Published Nov 6, 2018, 12:16 PM IST
Highlights

దీపావళీ సందర్భంగా టపాసుల ధరలు భారీగా పెరిగాయని.. సామాన్యులకు పండగ ఆనందం దూరమవుతుందనే వార్తలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఏ ఏడాది మాత్రం తొలిసారిగా ధరలు తగ్గాయి.

దీపావళీ సందర్భంగా టపాసుల ధరలు భారీగా పెరిగాయని.. సామాన్యులకు పండగ ఆనందం దూరమవుతుందనే వార్తలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఏ ఏడాది మాత్రం తొలిసారిగా ధరలు తగ్గాయి.

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో మార్పు కారణంగా గతేడాదితో పోలిస్తే.. టపాసులపై ధరలు తగ్గాయి. కిందటి సంవత్సరం జీఎస్టీ అమల్లోకి వచ్చాకా.. బాణాసంచాను తొలుత 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ఏడాదికి వచ్చేసరికి జీఎస్టీ రేటును 18 శాతానికి కుదించారు.

దీంతో తయారీ సంస్థలు ఎంఆర్‌పీలను తగ్గించాయి..అంతేకాకుండా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అమలవుతున్నందున అధికారిక అమ్మకాలు పెంచుతున్నారు.. జీఎస్టీ విధానంలో ముడిసరుకుపై చెల్లించిన పన్నును, వస్తువును విక్రయించాక, తయారీదారు వసూలు చేసుకుంటారు..

టోకు వ్యాపారులు తాము చెల్లించిన పన్నును రిటైలర్లకు అమ్మినప్పుడు తిరిగి పొందుతారు. మరోవైపు బాణాసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడం.. కేవలం రెండు గంటల సేపు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతించడంతో తయారీదారులు ఆందోళనకు గురయ్యారు. ఇది కూడా ధరల తగ్గుదలలో మార్పులకు కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. 

click me!