కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, రూ. 50 లక్షల ఆస్తినష్టం

Published : Aug 28, 2019, 10:59 AM IST
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, రూ. 50 లక్షల ఆస్తినష్టం

సారాంశం

చర్లపల్లి పారిశ్రామిక వాడలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఎరువులు, రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి.

చర్లపల్లి పారిశ్రామిక వాడలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఎరువులు, రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి.

ఆ వెంటనే కెమికల్ ఫ్యాక్టరీ నుంచి పక్కనే వున్న మరో పరిశ్రమకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో రూ.50 లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించి వుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays: కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్