కరోనా ఉందంటూ ప్రచారం.. ఇరు వర్గాల మధ్య చిచ్చు

Published : Aug 28, 2020, 12:15 PM ISTUpdated : Aug 28, 2020, 12:27 PM IST
కరోనా ఉందంటూ ప్రచారం.. ఇరు వర్గాల మధ్య చిచ్చు

సారాంశం

 ఓ కుటుంబం కారణంగా గ్రామంలో చాలా మందికి కరోనా సోకిందని.. అంతేకాకుండా.. వాళ్లు ఇతరులకు కూడా కరోనా సోకిందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో..  కరోనా సోకిన వ్యక్తి, ఆయన బంధువులపై దాడి చేశారు.

కరోనా వైరస్ ఇరు వర్గాల మధ్య  చిచ్చు పెట్టింది. మీ వల్లే చాలా మందికి కరోనా వచ్చిందంటూ ఓ వర్గం వారు.. కరోనా సోకిన వ్యక్తిని, వారి బంధువులపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  మండలంలోని నరసింహాపురం గ్రామంలో కొంత మందికి కరోనా సోకింది. అయితే..  కొంత మందికి కరోనా రాకపోయినా వచ్చిందంటూ ప్రచారం చేశారు. దీంతో.. ఓ కుటుంబం కారణంగా గ్రామంలో చాలా మందికి కరోనా సోకిందని.. అంతేకాకుండా.. వాళ్లు ఇతరులకు కూడా కరోనా సోకిందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో..  కరోనా సోకిన వ్యక్తి, ఆయన బంధువులపై దాడి చేశారు.

ఈ దాడి కాస్త ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రెండు వర్గాలకు చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇరువురి ఫిర్యాదులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu