కన్న కూతురిపైనే అత్యాచారయత్నం... నిందితుడికి కఠిన శిక్ష

Arun Kumar P   | Asianet News
Published : Feb 19, 2021, 09:25 AM ISTUpdated : Feb 19, 2021, 09:33 AM IST
కన్న కూతురిపైనే అత్యాచారయత్నం... నిందితుడికి కఠిన శిక్ష

సారాంశం

మానవ సంబంధాలకే మచ్చతెచ్చేలా కన్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించినఓ కసాయి తండ్రి పట్ల కోర్టు కూడా కఠినంగా వ్యవహరించింది. 

కరీంనగర్: కామంతో కనులు మూసుకుపోయి వావివరసలు మరిచి కన్న కూతురిపైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇలా మానవ సంబంధాలకే మచ్చతెచ్చేలా వ్యవహరించిన ఈ కసాయి తండ్రి పట్ల కోర్టు కూడా కఠినంగా వ్యవహరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన కరీంనగర్ జిల్లా అడిషనల్ సెషన్ కోర్టు  5 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన గురువయ్య తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగివచ్చి భార్యతో గొడవపడేవాడు. అయితే ఇలా తాగివచ్చిన సమయంలో అతడి కన్ను మైనర్ కూతురిపై పడింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అయితే బాలిక తండ్రి నుండి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

దాదాపు ఐదేళ్లుగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. సాక్షుల వాంగ్మూలం విన్న జడ్జి ఎస్ శ్రీనివాస రెడ్డి నిందితుడికి ఐదేళ్ల శిక్షతో పాటు ఆరు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu