మైనర్ కూతురుపై కన్న తండ్రి అత్యాచారం...రెడ్ హ్యండెడ్ గా భార్యకు చిక్కి

Published : May 25, 2019, 12:55 PM IST
మైనర్ కూతురుపై కన్న తండ్రి అత్యాచారం...రెడ్ హ్యండెడ్ గా భార్యకు చిక్కి

సారాంశం

సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన తెలంగాణ రాజధాని  హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కామాంధుడు గతకొంతకాలంగా ఇలా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడగా... తాజాగా అతడి భార్యకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబట్టాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో ఈ అఘాయిత్యం గురించి బయటపడింది.     

పోలీసులు, బాలిక తల్లి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొట్టకూటికోసం నగరానికి వలసవచ్చిన రాజు(30) మల్కాజిగిరి ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతడు అడ్డా కూలీగా పనిచేస్తుండగా భార్య కుషాయిగూడలో ఓ టీస్టాల్ నడుపుతోంది. ఈ దంపతులకు నలుగురు కూతుర్లున్నారు. 

అయితే వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే వారిపై కన్నేశాడు.  12ఏళ్ల వయసున్న రెండో కూతురిని బెదిరించి  భార్య ఇంట్లో లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని  ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో చిన్నారి భయపడిపోయి తల్లికి చెప్పలేదు. దీన్ని అదునుగా తీసుకుని అతడు  తరచూ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. 

అయితే ఓరోజు ఇలాగే భార్య టీస్టాల్ కు వెళ్లిన తర్వాత అతడు ఇంటికి చేరుకుని  మరోసారి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  అదే  సమయంలో ఇంటికి వచ్చిన భార్య భర్తను  రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. స్థానికుల సాయంతో అతడికి దేహశుద్ది చేసింది. 

అనంతరం కుషాయిగూడ పోలీసులకు పిర్యాదు చేసింది.  దీంతో పోలీసులు ఈ కామాంధున్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?