ఉప్పల్ లో దారుణం.. దుండగుల చేతిలో తండ్రీకొడుకు హతం.. (వీడియో)

Published : Oct 14, 2022, 08:49 AM ISTUpdated : Oct 14, 2022, 09:57 AM IST
ఉప్పల్ లో దారుణం.. దుండగుల చేతిలో తండ్రీకొడుకు హతం.. (వీడియో)

సారాంశం

ఉప్పల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రీకొడుకుల మీద గుర్తు తెలియని దుండగులు దాడిచేసి చంపేశారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని ఉప్పల్ లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తండ్రీకొడుకులను కత్తులతో పొడిచి చంపేశారు. తొలుత దుండగులు తండ్రి శర్మపై దాడి చేశారు. తన తండ్రి పై దాడిని అడ్డుకోవడానికి కొడుకు శ్రీనివాస్ ప్రయత్నించాడు. దాంతో వాళ్లు శ్రీనివాస్ మీద కూడా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో దుండగుల దాడిలో ఇద్దరూ మరణించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. శ్రీనివాస్ మలేషియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. 

ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద తండ్రి కొడుకులను గత అర్ధరాత్రి గుర్తుచేయని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. .ఉప్పల్ కు చెందిన వీరిని జి.నరసింహమూర్తి, అతని కుమారుడు శ్రీనివాస మూర్తిగా గుర్తించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?