అక్రమ సంబంధం....నడిరోడ్డుపై దారుణ హత్య

Published : Nov 29, 2018, 11:05 AM IST
అక్రమ సంబంధం....నడిరోడ్డుపై దారుణ హత్య

సారాంశం

వివాహేతర సంబంధం కారణంగా.. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా వేట కోడవళ్లతో నరికి చంపేశారు. ఈ ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం రేపింది.

హైదరాబాద్ నగరంలోని బీఎన్ రెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా.. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా వేట కోడవళ్లతో నరికి చంపేశారు. ఈ ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  నడి రోడ్డుపై స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్ గౌడ్‌ను కొందరు దుండగులు దారుణంగా వేట కొడవళ్ళతో నరికి చంపారు. మృతుడు మరో వ్యక్తితో కలిసి  ఇండికా కారులో వచ్చారని స్థానికులు తెలిపారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగింది. ఆ తర్వాత మరికొందరు వచ్చి వేటకొడవలితో  శ్రీనివాస్ గౌడ్ ని నరికి చంపినట్లు సమాచారం.

వివాహేతర సంబంధం కారణంగా శ్రీనివాస్ గౌడ్‌ను చంపినట్లు తెలుస్తోంది. మృతుడు కల్వకుర్తి తాలూకా తిమ్మరాసి పల్లి గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌