ఆపరేషన్ ఊపు: బిజెపిలోకి మాజీ మత్రి సుద్దాల దేవయ్య

Published : Sep 14, 2019, 07:32 AM IST
ఆపరేషన్ ఊపు: బిజెపిలోకి మాజీ మత్రి సుద్దాల దేవయ్య

సారాంశం

మాజీ మంత్రి సుద్దాల దేవయ్య బిజెపిలో చేరనున్నారు. ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్న ఆయన శుక్రవారంనాడు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్. కె లక్ష్మణ్ ను కలిశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు.

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సుద్దాల దేవయ్య బిజెపిలో చేరనున్నారు. ఆయన శనివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ను హైదరాబాదులో కలవనున్నారు. బిజెపిలోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో దేవయ్య బిజెపిలో చేరుతున్నారు. 

శుక్రవారంనాడు సుద్దాల దేవయ్య లక్ష్మణ్ తో భేటీ అయ్యారు.  టీడీపీ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెసులో ఉన్నారు. టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరారు. 

ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా నుంచి మరో ఇద్దరు ముఖ్య నేతలు, మహబూబ్ నగర్ నుంచి మరో నాయకుడు, పెద్దపల్లికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా బిజెపిలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. 

ఈ నెల 17వ తేదీన బిజెపి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంంలో పెద్ద యెత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా చేరికలకు కూడా ఊపునివ్వాలని భావిస్తోంది.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu