తనపై భూ ఆక్రమణల నిందలు వేసి మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
హైదరాబాద్:తనపై భూ ఆక్రమణల నిందలు వేసి మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం నాడు భేటీ అయ్యారు. భూ ఆక్రమణలంటూ తనపై నిందలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నాయకులను కలవడంలో భాగంగానే తాను మిమ్మల్ని కలుస్తున్నానని ఈటల రాజేందర్ చెప్పారు. ఇవాళ ఉదయం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసానికి ఈటల రాజేందర్ వెళ్లారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై ఈటల రాజేందర్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో చర్చించారు.
సీఎల్పీనేతతో ఈటల భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. మాసాయిపేట, హకీంపేటలో ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో ఆయనను మంత్రివర్గం నుండి కేసీఆర్ తప్పించారు. దేవరయంజాల్ లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఈల రాజేందర్ ఆయన అనుచరులు భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ నిర్వహిస్తోంది.