రేపు విచారణకు రావాలి: నేషనల్ హెరాల్డ్ కేసులో అంజన్ కుమార్ యాదవ్ కు ఈడీ నోటీస్

By narsimha lodeFirst Published May 30, 2023, 12:43 PM IST
Highlights

నేషనల్ హెరాల్డ్  కేసులో మాజీ ఎంపీ  అంజన్ కుమార్ యాదవ్  కు  ఈడీ  ఇవాళ  నోటీసులు  పంపింది.  

హైదరాబాద్; నేషనల్ హెరాల్డ్  కేసులో  మాజీ ఎంపీ  అంజన్ కుమార్ యాదవ్ కు  ఈడీ  అధికారులు  మంగళవారంనాడు నోటీసులు పంపారు.  ఈ నెల  31న  విచారణకు  రావాలని  ఆ నోటీసులో  పేర్కొన్నారు.  రేపు ఉదయం  11 గంటలకు విచారణకు  రావాలని  ఆ నోటీసులో  ఈడీ  పేర్కొంది. 

2022  నవంబర్ 23న  అంజన్ కుమార్ యాదవ్  ఈడీ విచారణకు  హాజరైన విషయం తెలిసిందే.  ఈ కేసులో  తెలంగాణ రాష్ట్రానికి  చెందిన  పలువురు  కాంగ్రెస్ నేతలు  ఈడీ విచారణకు  హాజరయ్యారు తాజాగా మరోసారి  ఈడీ విచారణకు  హాజరు కావాలని  అంజన్ కుమార్ యాదవ్ కు  ఈడీ  నోటీసులు  పంపింది నేషనల్ హెరాల్డ్  కేసులో  గత ఏడాది లో  ఈడీ విచారణకు  పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.  మాజీ మంత్రి గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు  ఈడీ విచారణకు  హాజరయ్యారు.

రూ. 2 వేల కోట్ల విలువైన  అసెట్స్ , ఈక్విటీ   లావాదేవీల విషయంలో  అవకతవకలు  చోటు  చేసుకున్నాయని ఆరోపణలు  వచ్చాయి.  నేషనల్ హెరాల్డ్  పత్రిక  ఆర్ధికంగా  ఇబ్బందుల్లో  ఉన్న సమయంలో  కాంగ్రెస్ పార్టీ  ఆర్ధిక సహాయం అందించింది. మరోవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్  ఏర్పాటైంది.   నేషనల్ హెరాల్డ్  కేసులో అవకతవకలు  జరిగాయని  బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఈ విషయమై  ఆయన  ఫిర్యాదు  చేశారు.  కేవలం రూ. 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను రికవరీ చేసుకునే హక్కును పొందిందని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. 
 

click me!