11.1 కిలోల బంగారం, రూ.1.5 కోట్ల విదేశీ కరెన్సీ: హైదరాబాద్ లో పట్టుబడ్డ మహిళా స్మగ్లర్

By Arun Kumar PFirst Published May 28, 2019, 9:09 PM IST
Highlights

శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ తెల్లవారుజామున  భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన విమానంలో దాదాపు 11 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న  ఓ మహిళను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆమెను అధికారులు తమదైన రీతిలో  ప్రశ్నించగా మరిన్ని  నిజాలను బయటపెట్టింది. 

శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ తెల్లవారుజామున  భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన విమానంలో దాదాపు 11 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న  ఓ మహిళను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆమెను అధికారులు తమదైన రీతిలో  ప్రశ్నించగా మరిన్ని  నిజాలను బయటపెట్టింది. 

గత మూడు నెలలుగా విదేశాల నుండి అక్రమంగా బంగారం, విదేశీ కరెన్సీని ఆ మహిళ హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.  దీంతో ఆమె తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లోని  ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తనిఖీలు నిర్వహించగా దాదాపు రూ.1.5 కోట్ల విలువ చేసే కలిగిన విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఈ కరెన్సీ మొత్తం సింగపూర్ డాలర్స్, యూఏఈ దినార్స్ రూపంలో వుంది. 

విమానాశ్రయంలో లభించిన బంగారం, హోటల్లో దొరికిన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళ ప్రత్యేకంగా తయారుచేసిన ఓ క్లాత్ ను  ఈ బంగారం స్మగ్లింగ్  కు ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. అందేవల్లే విమానాశ్రయ తనిఖీ అధికారులకు ఆమె పట్టబడకుండా యదేచ్చగా మూడు నెలల పాటు ఈవ్యవహారాన్ని నడిపినట్లు తెలిపారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సదరు మహిళా స్మగ్లర్ ను తనిఖీ చేయగా ఈ వ్యవహారం బయటపడినట్లు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఈమె వద్ద లభించిన బంగారం, విదేశీ కరెన్సీ మొత్తం కలిపి రూ. 3,62,52,500విలువ వుటుందని  అంచనావేశారు. 

ప్రస్తుతం స్మగ్లింగ్ కు పాల్పడిన మహిళను పోలీసులకు అప్పగించినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఆమె నుండి ఈ వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు. 

 
 

click me!