ఎలా సోకింది:కిరాణా షాపు యజమానికి కరోనా, భయాందోళనల్లో ప్రజలు

By Sree s  |  First Published Apr 10, 2020, 10:29 AM IST

హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే కరోనా ని ఎవరికీ పడితే వారికి సోకకుండా, సాధ్యమైనంత మేర ఆ వ్యాప్తిని నిరోధించడంలో తెలంగాణ సర్కార్ సఫలీకృతమైనట్టు చెప్పక తప్పదు. ఇంత పెద్ద నగరంలోనే వైరస్ ని దాదాపుగా అదుపులోకి తేగలిగిన సర్కార్ చిన్న ఊరు సూర్యాపేట విషయంలో మాత్రం ఇప్పుడు వణికిపోతుంది. 


హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే కరోనా ని ఎవరికీ పడితే వారికి సోకకుండా, సాధ్యమైనంత మేర ఆ వ్యాప్తిని నిరోధించడంలో తెలంగాణ సర్కార్ సఫలీకృతమైనట్టు చెప్పక తప్పదు. ఇంత పెద్ద నగరంలోనే వైరస్ ని దాదాపుగా అదుపులోకి తేగలిగిన సర్కార్ చిన్న ఊరు సూర్యాపేట విషయంలో మాత్రం ఇప్పుడు వణికిపోతుంది. 

అందునా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజికవర్గం కావడంతో అందరి కండ్లు ఈ జిల్లాపైన్నే పడ్డాయి. మర్కజ్ కి వెళ్లి వచ్చిన, లేదా వాయఱి కుటుంబీకులతోను సంబంధం లేని ఒక కిరాణా షాపు యజమానికి కరోనా సోకడం జిల్లా కేంద్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది. 

Latest Videos

ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన కుడకుడకు చెందిన వ్యక్తి ద్వారా ఇప్పటివరకు వైరస్‌ ఎనిమిది మందికి వ్యాపించింది.అతని నుండి ప్రైమరీగా వర్థమానుకోటలోని ఆరుగురు కుటుంబసభ్యులతో పాటు జిల్లా కేంద్రంలోని అపోలో మెడికల్‌హాల్‌లో పనిచేసే వ్యక్తికి వైరస్‌ సోకింది. ఇది ఒక మూడు నాలుగు రోజుల కిందటి విషయం. 

కాగా తాజాగా పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో కిరాణాషాపు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా సోకింది. ఈ వ్యక్తికి ఎవరి ద్వారా వైరస్‌ వచ్చిందో అంతుపట్టని విషయంగా మారింది. అధికారులు మూడు కోణాల్లో దర్యాప్తును మొదలుపెట్టారు. 

మెడికల్‌ హాల్‌ లో పనిచేస్తున్న వ్యక్తి నుండి వైరస్‌ సోకి ఉంటుందా,  లేదా ఇటీవలే మూడు పెళ్లిళ్లు జరిగాయి. అక్కడి నుండి ఏమైనా ఈ వైరస్‌ అంటిందా అనే కోణంతోపాటుగా లేదా వేరే ఇతర మార్గాల ద్వారా వచ్చిందా అనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా సూర్యాపేటలో భయాందోళనలు నెలకొన్నాయి. కిరానా షాపు యజమానికి కరోనా అని తేలడంతో అతడికి ఎలా సోకిందని విషయంతోపాటుగా, అతడు ఎవరెవర్ని కలిసాడు, ఎవరెవరికి సోకె ప్రమాదముందని దానిపై అధికారులు తీవ్ర తర్జన భర్జనలు పడుతున్నారు. 

పాజిటివ్‌కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు రెడ్‌జోన్లుగా ప్రకటిస్తూ, ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలను జారీ చేశారు.కానీ మిగతా ప్రాంతాలలో అన్ని రకాల షాపులు తీసి ఉండడం, ప్రజలేమో ఇంటికొకరు అని చెప్పినప్పటికీ, గుంపులు గుంపులుగా ఏదో నిత్యావసరాల కోసం అన్నట్టుగా కాకుండా షాపింగ్ మాదిరిగా వస్తున్నారు. 

ఇది ఇలా ఉంటె అధికారులపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తి అపోలో ఫార్మసీలో పనిచేసే వ్యక్తిని కలిసాడు అని తెలిసిన తరువాత అధికారులు ఆ షాప్ ని సీజ్ చేశారు తప్ప సీసీటీవీ ఫుటేజీని పరిశీలించలేదని, ఒకవేళ అలా గనుక చేసి ఉంటె... కాంటాక్ట్ కేసులు నమోదయ్యేయా అని పలువురు ఆరోపిస్తున్నారు. 

click me!