సిమ్ స్వాప్‌తో లక్షలు కొల్లగొట్టే ముఠా: అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

By narsimha lodeFirst Published Jan 21, 2021, 5:13 PM IST
Highlights

సిమ్ స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు


హైదరాబాద్: సిమ్ స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. 

మహారాష్ట్రలోని ముంబైకి చెందిన మీరారోడ్డు గ్యాంగ్ ను సైబరాబాద్ పోలీసులు పట్టుకొన్నారు.నిందితుల నుండి 40 నకిలీ ఆధార్ కార్డులు, 4 రబ్బరు స్టాంపులు, 15 మొబైల్ ఫోన్లు, నకిలీ లెటర్ ప్యాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్  వీసీ సజ్జనార్ గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 2011 నుండి సిమ్ స్వాప్ దందా నిర్వహిస్తోందన్నారు. దీని ద్వారా ఈ ముఠా కోట్లను కాజేశారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురి అరెస్ట్ చేశారు.

పలు సంస్థల ఆర్ధిక లావాదేవీలు చేస్తున్న ఫోన్ నెంబర్లనే లక్ష్యంగా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారని ఆయన చెప్పారు.

నిందితుల నుండి రూ. 11 లక్షలు కాజేశారన్నారు. ఈ ముఠాకు సంబంధించి దేశ వ్యాప్తంగా అనేక అకౌంట్లు ఉన్నాయన్నారు. కాజేసిన డబ్బులను బిట్ కాయిన్, హవాలా ద్వారా నైజీరియాకు తరలించారని ఆయన వివరించారు.

click me!