అర్దరాత్రి తుపాకీ మోతతో ఉలిక్కిపడ్డ మానుకొండూరు... రెచ్చిపోయిన క్రిమినల్ గ్యాంగ్ (వీడియో)

Published : Apr 20, 2023, 11:10 AM ISTUpdated : Apr 20, 2023, 11:24 AM IST
అర్దరాత్రి తుపాకీ మోతతో ఉలిక్కిపడ్డ మానుకొండూరు... రెచ్చిపోయిన క్రిమినల్ గ్యాంగ్ (వీడియో)

సారాంశం

పాత నేరస్తుడిపై ఓ క్రిమినల్ ముఠా తుపాకీతో కాల్పులకు తెగబడ్డ దుర్ఘటన మానుకొండూరు పట్టణంలో చోటుచేసుకుంది. 

కరీంనగర్ : అర్ధరాత్రి తుపాకుల మోతతో మానుకొండూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఓ క్రిమినల్ పై గుర్తుతెలియని దుండగుల ముఠా గన్ తో కాల్పులకు తెగబడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. క్రిమినల్ గ్యాంగ్ రోడ్డుపైనే మరో క్రిమినల్ ను చంపేందుకు ప్రయత్నించడం ప్రశాంతంగా వుండే మానుకొండూరులో అలజడికి కారణమయ్యింది.ఇలా  గన్ కల్చర్ పెరిగిపోయి నేరాలు జరుగుతుండటం కరీంనగర్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. 

ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మానుకొండూరు పట్టణంలో నివాసముండే అరుణ్ కుమార్ పాత నేరస్తుడు. అనేక నేరాలకు పాల్పడిన ఇతడిపై పిడి  యాక్ట్ వుంది. అయితే  గత అర్ధరాత్రి గుర్తుతెలియని క్రిమినల్స్ ముఠా అరుణ్ ను చంపేందుకు ప్రయత్నించింది. తుపాకులతో మానుకొండూరు చేరుకున్న ముఠాసభ్యులు అర్దరాత్రి అరుణ్ పై కాల్పులకు తెగబడ్డారు. 

దుండగుల ముఠా కాల్పులనుండి తప్పించుకున్నాడు అరుణ్. అయినప్పటికి వదిలిపెట్టకుండా ప్రాణభయంతో పారిపోతుండగా అతడిని పట్టుకున్న దుండగులు ముఠా విచక్షణారహితంగా దాడిచేసారు. దీంతో అరుణ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. 

వీడియో

తుపాకీ శబ్దాలతో మేలుకున్న మానుకొండూరు ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకునేసరికి అరుణ్ ను చితకబాది పారిపోతూ కనిపించింది దుండగుల ముఠా. వారిని వెంబడించిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకున్న వారి కోసం పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. 

అరుణ్ కుమార్ హత్యాయత్నానికి పాల్పడింది ఎవరు? దాడికి కారణాలేంటి? వారికి తుపాకీ ఎక్కడినుంది వచ్చింది? అనేది తెలియాల్సి వుంది. పట్టుబడ్డ నిందితున్ని విచారిస్తున్న పోలీసులు మిగతా ముఠాసభ్యుల గురించి తెలుసుకుంటున్నారు. గాయపడ్డ పాత నేరస్తుడు అరుణ్ నుండి కూడా ఈ దాడికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu
Hyderabad Weather : ఈ వర్షాలు ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్