సిపిఎఎస్ ప్రీ పోల్ సర్వే: కేసీఆర్ దే హవా, ఎన్ని సీట్లంటే...

Published : Dec 03, 2018, 08:55 PM IST
సిపిఎఎస్ ప్రీ పోల్ సర్వే: కేసీఆర్ దే హవా, ఎన్ని సీట్లంటే...

సారాంశం

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఘన విజయం సాధిస్తుందని తాజా ప్రీ పోల్ సర్వే ఒక్కటి తేల్చింది. సిపిఎస్ నిర్వహించన ఈ ప్రీ పోల్ సర్వే ఫలితాలను ప్రముఖ తెలుగు టీవీ చానెల్ టీవీ 9 సోమవారం సాయంత్రం ప్రసారం చేసింది.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఘన విజయం సాధిస్తుందని తాజా ప్రీ పోల్ సర్వే ఒక్కటి తేల్చింది. సిపిఎస్ నిర్వహించన ఈ ప్రీ పోల్ సర్వే ఫలితాలను ప్రముఖ తెలుగు టీవీ చానెల్ టీవీ 9 సోమవారం సాయంత్రం ప్రసారం చేసింది. దానిపై చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.

ఆ సర్వే ప్రకారం - మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ 94 నుంచి 104 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ పార్టీకి 49.7 శాతం ఓట్లు పోలవుతాయి.  ప్రజా కూటమి 32.3 శాతం ఓట్లతో 16 నుంచి 21 స్థానాలకే పరిమితమవుతుంది. 

బిజెపికి ఒక్క స్థానం మాత్రమే వస్తుంది. ఆ పార్టీకి 9.1 శాతం ఓట్లు వస్తాయి. మజ్లీస్ 2.4 శాతం ఓట్లతో తన ఏడు స్థానాలను తిరిగి గెలుచుకుంటుంది. ఇతరులు ఒక్క స్థానాన్ని గెలుచుకుంటారు. మొత్తం ఇతరులకు 6.5 శాతం ఓట్లు పడుతాయి.

PREV
click me!

Recommended Stories

యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family